టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , బన్నీ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు .. ఇప్పుడు మహేష్ తన 29వ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు .. అయితే ఈ ఐదుగురు హీరోలు ఏ సినిమా చేసిన ? అది పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అవుతుంది .. అయితే ఇప్పుడు ఈ నయా హీరోల పాన్ ఇండియా నమ్మకం ఎవరు ? అంటే రాజమౌళి , సుకుమార్ , ప్రశాంత్ నీల్ ,  సందీప్ రెడ్డి వంగ నాగ్ అశ్వీన్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

అయితే ఇప్పటికే రాజమౌళి - ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో సినిమాలు చేశారు . ఈ ముగ్గురు కామన్ గా పని చేయాల్సిన డైరెక్టర్ ఒకరు ఉన్నారు .  అతనే సుకుమార్ .  అయితే సుకుమార్ ఇప్పటికే రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా చేసిన అది పాన్ ఇండియా సినిమా కాదు .. అయితే రామ్ చరణ్ 17వ సినిమా సుకుమార్ తో ఇప్పటికే ఫిక్స్ అయింది .  అలాగే ప్రభాస్ కూడా సుకుమార్ తో ఓ సినిమా చేయాలి .  ఎన్టీఆర్ కూడా సుకుమార్ తో పాన్ ఇండియా సినిమా చేయాలి గతంలో నాన్నకు ప్రేమతో చేశాడు .  అది పాన్ ఇండియ‌ మూవీ కాదు .

 

అలాగే సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్‌ సినిమా చేయబోతున్నాడు .  మిగిలిన నలుగు హీరోలు కూడా సందీప్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు .  ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్‌ ప్రభాస్ తో సలార్ సినిమా చేశాడు .  ప్రెసెంట్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా చేస్తున్నాడు .  ఇక రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు .. అలాగే నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ తో సినిమా చేసాడు .. మిగిలిన హీరోలతో పని చేయడానికి రెడీగా ఉన్నాడు . అయితే ఇవన్నీ కూడా ఎవరు ఊహించని సూపర్ కాంబినేషన్స్ .. వీరు కలిస్తే వందల వేల కోట్ల మార్కెట్ జరుగుతుంది .  అయితే వచ్చే పదేళ్లలో ఈ కాంబినేషన్స్‌ సెట్ అవ్వడానికి గట్టి చాన్స్ ఉంది . ఈ :ద‌ఉగురు డైరెక్టర్లతో ఈ బడా హీరోలు కూడా కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు .  రాబోయే పదేళ్ల తర్వాత తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవటంలో ఈ కాంబినేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నది మాత్రం వాస్తవం .

మరింత సమాచారం తెలుసుకోండి: