బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ లతో ఎంతో ఫేమస్ అయింది .. అయితే హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి .. 2008లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత 2009 ఫాంటసీ కామెడీ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది .. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు .. కానీ అందం అభినయంతో మాత్రం ఆకట్టుకుంది .  సినిమాలకంటే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల తోనే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ .. ఇప్పుడు ఈ హీరోయిన్ కి సొంతంగా ఓ దివి కూడా ఉంది .. ఇంతకీ ఈమె మరెవరో కాదు .. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. అలాద్దీన్ సినిమా తో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది ఆ తర్వాతమర్డర్ 2, హౌస్‌ఫుల్ 2, రేస్ 2 మరియు కిక్ వంటి సినిమాలో నటించి మంచి క్రెజ్‌ తెచ్చుకుంది.
 

జాక్వెలిన్ దక్షిణ తీరంలో ఉన్న నాలుగు ఎకరాల దీవిని 2012 లో దాదాపు 3.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది.  అయితే ఈ ద్వీపం శ్రీలంక మాజీ క్రికెటర్  కెప్టెన్ కుమార్ సంగక్కర యాజమాన్యంలోని మరొక ప్రైవేట్ దీపానికి సమీపంలో ఉంది . అలాగే ఇది లగ్జరీ రియల్ ఎస్టేట్ కు ప్రధాన గమ్యస్థానంగా మారింది .. ఇక ఈ దీపంలో ఆమె ఒక విల్లాన్ని కూడా నిర్మించాలని .. ఇక దాన్ని పర్సనల్ గెస్ట్ హౌస్గా మార్చుకోవాలని భావిస్తుంది .  పలు నివేదికల ప్రకారం జాక్వెలిన్ ఆస్తులు దాదాపు  160 కోట్లుగా తెలుస్తుంది .. అలాగే ఈమె సంవత్సరానికి 15 కోట్లకు పైగా సంపాదిస్తుందట .

 

ఇక 2017లో జుడ్వా 2 సినిమా తో చివరిసారిగా విజయం అందుకున్న  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. గత ఎనిమిది సంవత్సరాలగా వరుస‌ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాలను అందుకుంటుంది .. డ్రైవ్, రాధే, భూత్ పోలీస్, బచ్చన్ పాండే, ఎటాక్, రామ్ సేతు, సర్కస్, ఫతే సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి .. ఇక జాక్వెలిన్ తన తరువాతే సినిమా హౌస్ ఫుల్ 5   కోసం రెడీ అవుతుంది .. ఇందులో బాలీవుడ్ స్టార్స్‌ అక్షయ్ కుమార్ , అభిషేక్ బచ్చన్ రి రితేష్ దేశ్‌ముఖ్, డినో మోరియా, ఫర్దీన్ ఖాన్, సోనమ్ బజ్వా, చంకీ పాండే... అలాంటివారు కీలకపాత్రలో  నటిస్తున్నారు . మరి ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీ సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: