
మరి ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ డిసప్పాయింట్ మెంట్ ఇచ్చింది అని చెప్పాలి . అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అల్లు అర్జున్ . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . కానీ ఈ సినిమా కన్నా ముందే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకో రాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది రోజు జరుపుకోబోతున్నారట .
అయితే ఈ సినిమాతోనే ఆయన తన పేరుని మార్చుకోబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ లో న్యూమరాలజీ ప్రకారం 2 "U" లను రెండు "N" లను యాడ్ చేస్తే ఆయన కెరియర్ కి ఇక తిరుగు ఉండదు అనే విధంగా ఆయన డిసైడ్ అయ్యారట. ఆ కారణంగానే న్యూమరాలజిస్ట్ స్పెషలిస్టులతో మాట్లాడి మరి ఆయన పేరులో ఎక్స్ట్రా "U" ఎక్స్ట్రా "N" జోడించబోతున్నారట . ఈ ప్రకారం అల్లు అర్జున్ కి బాగా కలిసి వస్తుంది అని .. ఇండియన్ హిస్టరీ లోనే నెంబర్ వన్ హీరోగా ఆయన పేరు మారుమ్రోఘిపోతుంది అని భావిస్తున్నారట. దీంతో అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!