
ఈ మూడు ఎదురు దెబ్బలు తమిళ చిత్ర పరిశ్రమను ఊహించని విధంగా దెబ్బతీశాయి .. దీంతో అక్కడ సీక్వెల్స్ అంటేనే ప్రేక్షకులు భయపడిపోతున్నారు .. అయితే కోలీవుడ్ లో రెండు సీక్వెల్స్ పై మాత్రం భారీ అంచనాలు పెంచుతున్నాయి .. ఒకటి ‘జైలర్ 2’. మరొకటి ఖైదీ 2 రజినీకాంత్ నెల్సన్ కాంబోలో వచ్చిన ‘జైలర్ ’ మంచి విజయం అందుకుంది అలాగే రజనీకాంత్ కి చాలా కాలం తర్వాత భారీ విజయం దొరికింది .. అలాగే జైలర్ 2 లో ఏం చూపించబోతున్నారు అన్న విషయంలో కూడా జైలర్ 1 లోనే క్లారిటీ ఇచ్చేశాడు నెల్సన్ .. పార్ట్ 2 కు కావలసినంత స్టోరీ బిల్డప్ ముందే సెట్ చేశాడు .. ఇక జైలర్ లో మోహన్‌లాల్ , శివరాజ్ కుమార్ వంటి స్టార్‌లు ప్రత్యేక పాత్రలో నటించారు ..
ఇక ఇప్పుడు ఈసారి కూడా గెస్ట్ అపీరియన్స్ కు ఎలాంటి కొదవ లేదని కూడా తెలుస్తుంది .. టాలీవుడ్ నుంచి కూడా ఓ స్టార్ హీరో జైలర్ 2 లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి .. ఇదే జరిగితే జైలర్ 1న్ కంటే జైలర్ 2 పెద్ద హిట్ అవ్వచ్చు . ఇక లోకేష్ కనగరాజ్ ఈ దర్శకుడు పట్టిందల్లా బంగారమే ఇప్పుడు .. కార్తీ తో చేసిన ఖైదీ తో తన స్టామనా ఏంటో చూపించాడు .. ఖైదీ 2 చేయాలని కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాడు .. కానీ ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కడానికి రెడీ అవుతుంది .. ఖైదీ 2 కి కావాల్సినంత స్టొరీ పార్ట్ 1న్ లోనే సెట్ చేసుకున్నాడు లోకేష్ .. కాబట్టి ఈసారి ఖైదీ మరింత ఆసక్తిగా తయారయ్యే అవకాశం ఉంది.. ఇప్పుడు ఈ రెండు సీక్వెల్స్ కోలీవుడ్ ని మళ్లీ దారిలో పెడతాయని తమిళ ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు . ఇక వారి నమ్మకాన్ని ఎంతవరకు నిలబడతాయో చూడాలి .