దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”..ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

అయితే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా రాజమౌళి ఎంతో సీక్రెట్ గా నిర్వహించారు.. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకి చాలా స్పెషల్ గా ఉండాలని జక్కన్న ప్రయత్నిస్తున్నాడు.. కానీ షూటింగ్ సెట్స్ లో లీక్స్ ఆయన్ని కలవరపెడుతున్నాయి.. దీనితో మూవీ టీం అంతటికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. లీక్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. దీనితో ఈ సినిమా గురించి ఏ విషయం కూడా స్వయంగా రాజమౌళి ప్రకటిస్తే తప్ప ఏ ఇతర ఆర్టిస్ట్ మాట్లాడలేరు. తాజాగా పృద్విరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకుడిగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా L2 ఎంపురాన్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంలో మీరు SSMB 29 సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూట్ ఎలా జరుగుతుందని ప్రశ్నించగా అందుకు బదులుగా పృద్వి ‘ అవునా.. నిజామా. నేను మహేశ్ కలిసి జస్ట్ సైట్ సీన్ కోసం వెళ్లాం అని నవ్వతూ బదులిచ్చాడు. అలాగే ఒక సంవత్సర కాలంగా ఆ సినిమాపై వర్క్ జరుగుతుంది. ఒక మాస్టర్ క్లాస్ సినిమా రాబోతుందని, ఇంతకు మించి ఏమి మాట్లాడలేని  పృద్వి రాజ్ అనడంతో స్టార్స్ ని సైతం రాజమౌళి కంట్రోల్ చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

మరింత సమాచారం తెలుసుకోండి: