టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న గురించి ఎంత చెప్పినా తప్పే అవుతుంది. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమే దాదాపు 20 ఏళ్లకు పైనే అయినా ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. కాగా, మిల్కీ బ్యూటీ తమన్నా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చిన్నది నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓదెల-2 సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.


ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులలో మంచి అంచనాలను అందుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు  ఇక ఫైనల్ గా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఓదెల సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా ఓదెల పార్ట్-2ని తీశారు.



ఓదెల పార్ట్-2 సినిమాని మేకర్స్ ఈ నెల 17వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమాకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. తెలుగుతో సహా వివిధ భాషలలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కాంతార, మంగళవారం, విరూపాక్ష సినిమాకు సంగీతం అందించిన దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు.


మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో విడిపోయినట్టుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పైన తమన్నా ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: