- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ సినిమా “ పుష్ప 2 ” కోసం అల్లు అర్జున్ ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడు .. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికి తెలిసిందే. పుష్ప 2 సినిమా ఏకంగా బాహుబ‌లి 2 రికార్డుల ను సైతం బీట్ చేసి ఇండియాలోనే వ‌సూళ్ల ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంది. ఈ సినిమా దెబ్బ‌కు బ‌న్నీ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లి పోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం లో మ‌రో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


ఇక పుష్ప ప్రాంచైజీ ద‌ర్శ‌కుడు సుకుమార్ కు బ‌న్నీ కి మ‌ధ్య అంత‌కు ముందు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. పుష్ప ఫ్రాంచైజ్ కి ముంచి ఆర్య ఫ్రాంచైజ్ తెర‌కెక్కి హిట్లు కొట్టిన‌ సంగతి తెలిసిందే. బ‌న్నీ రెండో సినిమా ఆర్య నుంచే బ‌న్నీ - సుక్కు కాంబినేష‌న్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ రెండు సినిమా లు కూడా ఆడియెన్స్ లో మంచి కల్ట్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే వ‌చ్చే ఏప్రిల్లో అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సారి మేక‌ర్స్ ఆర్య 2 రీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు.


ఆర్య 2 సినిమా కు గ‌తంలో ఏ సినిమా కు జ‌ర‌గ‌ని విధంగా రీ రిలీజ్ ప్లాన్ వేసుకుంటున్నారు. ఆర్య 2 సినిమా ను ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. రీ రిలీజ్ లో కూడా ఆర్య 2 క‌లెక్ష‌న్ల ప‌రంగా ను .. ఇటు రిలీజ్ ప‌రంగాను సెన్షేష‌న‌ల్ రికార్డు సాధించేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: