
నేచురల్ స్టార్ నాని అంటేనే ఓ విభిన్నమైన రుచితో సినిమాలు చేస్తుంటాడు.. నాని మంచి అభిరుచి కల హీరో అన్న టాక్ వచ్చేసింది. నాని గతం నుంచి చూసుకుంటే వరుసగా ప్రతి సినిమా తోనూ కొత్త తరహా కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు జయాప జయాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటుందన్న అంచనాలు అయితే అందరిలోనూ ఉన్నాయి. గత పదేళ్లలో నాని నటించిన అన్ని సినిమాలు ఇలాగే కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. ఈ కథలు ఎంచుకునే వైవిధ్యమే నానిని తిరుగులేని హీరోగా నిలబెట్టింది.
ఇక హీరోగానే కాకుండా నాని నిర్మాతగాను మారి వరుసగా సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నాడు. తాజాగా టాలీవుడ్ లో నాని నిర్మాతగా తెరకెక్కి రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన సినిమా కోర్ట్. టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, హర్ష రోహన్ , శ్రీదేవి కాంబినేషన్ లో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులు .. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు సొంతం చేసుకుంటోంది.
ఇక ఇంట్రెస్టింగ్ కోర్ట్ డ్రామాగా వచ్చిన ఈ కోర్ట్ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకొని నానికి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఓ వరాల్‌గా ఇప్పటికే మొత్తం 8 రోజుల రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో కూడా ఈ చిత్రం వీక్ డేస్ లోనూ సాలిడ్ నంబర్స్ కొట్టడం మామూలు విషయం కాదు. 8వ రోజు ఈ సినిమా రు. 2.7 కోట్ల గ్రాస్ ని అందుకుంది. మొత్తం 8 రోజులకు గాను కోర్ట్ సినిమా 42.3 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా సమాచారం. ఈ వీక్ డేస్‌లోనే ఈ వసూళ్లు 50 కోట్ల మార్క్ ని అందుకోనున్నాయి.