
టాలీవుడ్ లో ఇప్పుడు మన యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ గా దూసుకుపోతోన్న ప్రభాస్ రాజు హీరోగా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులే తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో త్వరలోనే రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమా ది రాజా సాబ్. ఆ తర్వాత సలార్ 2 , కల్కి 2 , స్పిరిట్ , ఆ తర్వాత మరో పాన్ ఇండియా సినిమా ఇలా ఏ సినిమా చూసుకున్నా క్రేజీ ప్రాజెక్టు గానే కనిపిస్తోంది. ప్రభాస్ హీరో గా .. శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ సినిమా “ సలార్ ” . ప్రభాస్ కు రెండు వరుస ప్లాప్ సినిమా ల తర్వాత వచ్చిన సలార్ సూపర్ హిట్ అయ్యి ఏకంగా రు .. 600 కోట్ల వసూళ్లు సాధించి హిట్ కొట్టింది. .
ఇక ఈ సినిమా ను ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తోన్న రీ రిలీజ్ ట్రెండ్ నేపథ్యం లో తిరిగి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీ రిలీజ్ విషయంలో కూడా సలార్ కు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. సలార్ రీ రిలీజ్ లో ఇప్పటికే 3.24 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. అసలు ఇది మామూలు రికార్డు కాదనే చెప్పాలి. ఇక ఫుల్ రన్ లో సలార్ రీ రిలీజ్ వసూళ్లు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతాయో ? చూడాలి. సలార్ సినిమాకు రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు .. .