టాలీవుడ్ లో ఉన్న అందరు హీరోల అభిమానులు ప్రధానంగా ప్రభాస్ , మెగా , అక్కినేని , నందమూరి ఫ్యాన్స్ ఇలా అందరు హీరోల అభిమానులంతా మరో వారం రోజుల్లో రాబోతున్న తెలుగు సంవత్సరాది ఉగాది కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు .. ఇక దీనికి ప్రధాన కారణం .. ఈ ఉగాదికైనా మా హీరోల సినిమాలు అప్డేట్ వస్తాయని వారి ఆశ .. గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న స్పిరిట్ సినిమా పై ఈ ఉగాదికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది .. అలాగే ఉగాది రోజున ఈ మూవీ యూనిట్ నుంచి ఓ అప్డేట్ వస్తుందని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు ..


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో ఇప్పటికే సినిమా సెట్స్‌ పైకి వెళ్ళాలి .. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు .. అయితే ఈ ఉగాదికి ఈ ముచ్చట‌ కూడా తీరుతుందని అభిమానులు ఆశ . మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ఉగాది కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ..  హరిహర వీరమల్లు సినిమాకు కొత్త విడుదల తేదీ ప్రకటించడంతో .. ఓజి నుంచి కూడా ఓ ప్రకటన కోసం వారు ఎదురుచూస్తున్నారు .. అలాగే ఉగాది రోజున ఓజీ టీం నుంచి ఏదైనా కొత్త తేదీ అనౌన్స్మెంట్ ఉంటుందని వాళ్ళు ఆశపడుతున్నారు . ఇక మరోపక్క అక్కినేని అభిమానులు కూడా అదే విధంగా ఎదురుచూస్తున్నారు ..  


గత చాన్నాళ్లుగా కెమెరాకు దూరంగా ఉన్న అఖిల్ నుంచి ఈ ఉగాదికి కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని వారి భావిస్తున్నారు .. యువి క్రియేషన్స్ బ్యానర్ పై చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది .. ఈ లిస్టులో చిరంజీవి విశ్వంభర కూడా ఉంది .  ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది .. అప్పటినుంచి ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ రావటం లేదు .. ఈ సమ్మర్లో సినిమా వస్తుందని మొన్నటి వరకు ప్రచారం వచ్చింది .. కానీ జూలై చివరి వారం లేదా ఆగస్టు కు ఈ సినిమా వెళ్లిందని టాక్ కూడా ఉంది .. దీనిపై కూడా ఈ ఉగాదికి సరైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: