- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 , పుష్ప 2 సినిమా ల‌తో దేశ వ్యాప్తంగానే సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయారు. మ‌రీ ముఖ్యంగా పుష్ప 2 దెబ్బ‌కు బ‌న్నీ అంటే నార్త్ ఇండియ‌న్ యూత్ .. నార్త్ ఇండియ‌న్ మాస్ జ‌నాలు పిచ్చెక్కిపోతున్నారు. ఇక పుష్ప 2 త‌ర్వాత కాస్త రిలాక్స్ అవుతోన్న బ‌న్నీ ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ
అట్లీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి విదిత‌మే. ఈ సినిమా కూడా భారీ పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు అయితే న‌డుస్తున్నాయి. ఇక ఈ సినిమా పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రానుంది. పుష్ప 2 హిట్ ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అక్క‌డ అట్లీ సినిమాకు సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది.


త్వ‌ర‌లోనే బ‌న్నీ ఇండియాకు తిరిగి వ‌స్తారు. వ‌చ్చాక అఫీషియ‌ల్ గా బ‌న్నీ - అట్లీ కాంబోకు సంబంధించిన ఓ ప్ర‌క‌ట‌న అధికారికంగా విడుద‌ల చేస్తార‌ట‌. ఇక అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బ‌న్నీ ది డ్యూయ‌ల్ రోల్ అని టాక్ ? ఇక ఓ పాత్ర హీరో ది కాగా.. రెండో పాత్ర పూర్తి గా నెగిటీవ్ షేడ్స్ ఉంటాయ‌ట‌. ఈ రెండో పాత్ర దాదాపు విల‌న్ పాత్ర‌కు స‌మాన‌మైన పాత్ర అనుకోవ‌చ్చ‌ని కూడా అంటున్నారు. అంటే ఈ సినిమాలో బ‌న్నీ నే హీరో .. బ‌న్నీనే విల‌న్ అనుకోవాలి. ఈ త‌ర‌హా పాత్ర‌లు చేయ‌డం హీరో ల‌కు ఓ విధంగా ఛాలెంజ్ అనుకోవాలి. బ‌న్నీ ఇప్పుడు ఈ కొత్త టాస్క్ తీసుకున్నాడు. ఆ మాట‌కు వ‌స్తే పుష్ప లో కూడా బ‌న్నీ పాత్ర‌లో కొంత నెగిటీవ్ షేడ్ క‌నిపిస్తుంది. కాబ‌ట్టి.. బ‌న్నీ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ను కోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: