పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ రేంజే మారిపోయింది.ఈ సినిమాతో ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో అంతా ఎక్కువ పాపులర్ అయ్యారు.వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ ఈయన పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఒక్కసారి జైలుకు వచ్చిన అనుభవంతో అల్లు అర్జున్ ఓవర్ నైట్ లో మరింత పాపులర్ అయిపోయారు. అయితే అలాంటి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్లో ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటివరకు ఏ హీరో కూడా తీసుకొని రెమ్యూనరేషన్ తో అల్లు అర్జున్ సరి కొత్త ట్రెండ్ సృష్టించారు. సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప టు సినిమాకి గాను అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. 

అయితే 300కోట్ల రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. పరోక్షంగా అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటే తప్పేముంది అన్నట్లుగా స్పందించారు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప, పుష్ప టూ రెండు సినిమాలకు ఐదు సంవత్సరాలు కేటాయించారు. ఐదు సంవత్సరాలకు ఐదు సినిమాలు చేసినా కూడా సినిమాకో 100 కోట్లు వేసుకుంటే 500 కోట్లు కానీ అల్లు అర్జున్ 300 కోట్లే కదా అన్నట్లుగా స్పందించారు.అలాగే ఓ హీరో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే ట్యాక్స్ కింద అన్ని పోను కేవలం 60 కోట్లు మాత్రమే ఇంటికి వస్తాయి అంటూ స్పందించారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ గురించి మరో వార్త తమిళ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే..అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో పాటు అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. 

అయితే తాజాగా తమిళ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సినిమా హిట్ అయితే ఆ సినిమా లాభాల్లో దాదాపు 15% వాటా ఇచ్చేలా ఆ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక అన్ని విషయాలు పూర్తయితే ఈ ఏడాది అక్టోబర్ లో అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం. ఇక ఈ రెమ్యూనరేషన్ తో అల్లు అర్జున్ ఇండియాలోనే హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ గా మరింత పాపులర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: