
ఆ సినిమా అనంతరం కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో నిధి అగర్వాల్ పేరు తరచూ వార్తలలో నిలుస్తోంది. నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి పేర్లలో ఈ చిన్నదాని పేరు అనేక సార్లు తెరపైకి వచ్చింది. త్వరలోనే నిధి అగర్వాల్ ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా..... ప్రస్తుతం ఇది అగర్వాల్ తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ చిన్నది ఇద్దరు తెలుగు స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ప్రభాస్ హీరోగా చేస్తున్న ది రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలను అందుకున్నట్లయితే ఈ చిన్నదాని క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉండగా.... ప్రస్తుతం నిధి అగర్వాల్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. నిధి అగర్వాల్ తో సినిమాలు చేయడానికి ఇద్దరు యంగ్ హీరోలు ఆసక్తిని చూపిస్తున్నారట. ఆ హీరోలు ఎవరు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా... హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే నిధి అగర్వాల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.