సినీ ఇండస్ట్రీలో స్టార్ నటులుగా కొనసాగుతున్న వారిలో నేచురల్ స్టార్ నాని, ఘట్టమనేని మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు. ఈ ఇద్దరు హీరోలు వారి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, హీరో నాని వారి సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ఓ సినిమాని తీయాలని డైరెక్టర్ వంశీ పైడిపల్లి అనుకున్నారట.


అయితే మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన వాటిలో మహర్షి సినిమా ఒకటి. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా, అల్లరి నరేష్ మహేష్ బాబుకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరో అల్లరి నరేష్ ను కాకుండా నేచురల్ స్టార్ నానిని మహేష్ బాబుకి ఫ్రెండ్ పాత్రలో చేపించాలని అనుకున్నారట. అయితే ఆ పాత్రను హీరో నాని రిజెక్ట్ చేశారట. అనంతరం ఈ క్యారెక్టర్ కోసం అల్లరి నరేష్ ను సంప్రదించగా అతను వెంటనే ఓకే చెప్పారట.


ఇక మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ విషయం తెలిసి నాని అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మంచి విజయాన్ని అందుకునేదని కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా హీరో నాని కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు, నాని సినిమాల కోసం వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: