ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో ఊహించని భారీ సక్సెస్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా అల్లు అర్జున్ కి కొన్ని చేదు జ్ఞాపకాలు అందించినా కానీ అల్లుఅర్జున్ బ్రాండ్ ని ప్రపం చానికి పరిచయం చేసింది. ప్రపంచ నలు మూలలకు సైతం పుష్ప రాజ్ హవా కొనసాగింది.. ఇంతటి భారీ సక్సెస్ అందుకున్న అల్లుఅర్జున్ నుంచి తరువాత ఎలాంటి సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎం తో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 అల్లు అర్జున్ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ త్రివిక్రమ్ ప్లేస్ లోకి తాజాగా యంగ్ డైరెక్టర్ అట్లీ వచ్చి చేరారు.. అట్లీ సినిమా తరువాత అల్లుఅర్జున్ త్రివిక్రమ్ మూవీ చేయనున్నారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు, అక్కడే అట్లీ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్‌ కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌ లో కనిపించనున్నారని సమాచారం.

ఈ సినిమాలో అల్లుఅర్జున్ చేసే ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని, దాదాపు విలన్‌కు సమానమైన పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. అంటే, ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలు రెండూ అల్లు అర్జున్‌ చేయనున్నట్లు సమాచారం. 'పుష్ప'లో కూడా అల్లు అర్జున్ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్ కనిపించింది.. దీనితో అల్లుఅర్జున్ అట్లీ సరికొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తుంది..అలాగే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: