ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఎన్టీఆర్ చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా జపాన్ లో కూడా అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు. అప్పట్లో రజినీకాంత్ కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ముఖ్యంగా ముత్తు సినిమాతో రజనీకాంత్ క్రేజ్ పెరగడంతో అప్పటినుంచి ఇప్పటికే కూడా ఆయన సినిమాలో అక్కడ విడుదల చేస్తూ భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా చాలామంది హీరోలు కూడా ఇతర భాషలలో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలా ప్రభాస్ బాహుబలి చిత్రంతో భారీ క్రేజ్ అందుకోగా ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటించిన rrr చిత్రంతో కూడా పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించారు.



జపాన్ లో rrr చిత్రం ఏకంగా 100 రోజులు ఆడడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ని రాబట్టిందట. దీంతో ఎన్టీఆర్ కి అభిమానులు పెరగడం జపాన్ లో కూడా  జరిగింది..ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉన్నది. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.500 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.ఇటీవలే జపాన్లో దేవర స్పెషల్ ప్రివ్యూ షో కూడా వేయడంతో మంచి స్పందన లభించిందట. ఎన్టీఆర్ నటనకు అందులో ఉండే యాక్షన్ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అవుతున్నట్లు తెలుపుతున్నారు.

ఇలా ప్రివ్యూ కి వచ్చిన టాక్ తో జపాన్లో దేవర సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అలా మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే నమోదైనట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా దేవర సినిమా ప్రమోషన్స్ సైతం జపాన్లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో జపనీస్ సోషల్ మీడియా యూజర్స్ కూడా ఎన్టీఆర్ కటౌట్ ను పెట్టుకొని మరి ఆయుధ పూజలతో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఒక బీభత్సవం సృష్టిస్తున్నట్లు వీడియో వైరల్ గా మారుతున్నది. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: