సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే కొన్ని సంవత్సరాల పాటుగా వారి హవాను కొనసాగిస్తారు. అందులో నటి త్రిష ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది వర్షం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో తన నటన, అందం అభినయం కి ప్రేక్షకులు ఎంతగానో ఫిధా అయ్యారు.


సినిమా అనంతరం త్రిష వెనుదిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆగ్ర హీరోయిన్ గా దూసుకుపోయింది. త్రిష ఇప్పటికీ సినిమాలు చేస్తూ తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా, ఈ చిన్నది వర్షం సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.


అయితే ఈ సినిమా కోసం త్రిష చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా ఈ సినిమాలో వర్షం సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో ఆమె కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిందట. ఇక మరి ముఖ్యంగా త్రిష ఓ సమయంలో వర్షం సీన్ కోసం చాలా కష్టపడ్డారట. ఆ సీన్ సరిగ్గా రాలేదని 10 సార్లు రిపీట్ గా ప్రయత్నం చేశారట. ఆ సమయంలో త్రిష కాస్త టార్చర్ లా ఫీల్ అయిందట.


ఈ విషయాన్ని త్రిష ఓ సందర్భంలో వెల్లడించారు. అంతే కాకుండా ప్రభాస్ తో కలిసి సినిమాలో నటించినందుకు తనకు చాలా సంతోషంగా అనిపించిందని త్రిష చెప్పారు. అంతేకాకుండా ప్రభాస్ సినిమా షూట్ సమయంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని త్రిష చాలా సందర్భాలలో వెల్లడించారు. గతంలో త్రిష చేసిన ఈ కామెంట్లను ఇప్పుడు తన అభిమానులు వైరల్ చేస్తున్నారు. త్రిష చేసిన ఈ కామెంట్లు చూసి ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: