కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సిరీస్ తో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించింది.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో కన్నడ సినిమాలకు కూడా క్రేజ్ బాగా పెరిగింది.. కర్ణాటక గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. చాప్టర్ 1 సృష్టించిన హిస్టరీని కేజీఎఫ్ చాప్టర్ 2 కొనసాగించింది.. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇంతటీ భారీ హిట్స్ అందుకున్న హీరో యశ్ నుంచి తరువాత ఎలాంటి సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు..

ఎంతో కాలంగా యష్ నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి నిరీక్షణ ఫలించింది..గీతు మోహన్దాస్ డైరెక్షన్ లో యష్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ "టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్" ఈ సినిమాని మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యశ్, వెంకట రమణ నిర్మిస్తున్నారు.. ఈ మూవీ కోసం మేకర్స్ వివిధ దేశాలకు చెందిన యాక్టర్లను, టెక్నిషియన్లను తీసుకున్నారు...ఈ సినిమాను ఇంగ్లిష్ భాషలో కూడా విడుదల చేస్తున్నారు.
ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. 

ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.యశ్ టాక్సిక్ సినిమా వచ్చే ఉగాదికి 2026 మార్చ్ 19 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: