
పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పూజా రెట్రో మూవీలో సూర్యకి జంటగా నటిస్తుంది. అలాగే కూలీ, కాంచన 4 సినిమాలలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ అందాల భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో పురుష అధిక్యం ఉంటుందని తెలిపింది.
పూజా హెగ్డే మాట్లాడుతూ.. 'హీరో వ్యానిటీ వ్యాన్ మూవీ షూటింగ్ జరిగే సెట్ పక్కన ఉంటుంది. మిగితావారికి మాత్రం దూరంగా ఉంటాయి. మేము భారీ లెహంగాలు వేసుకుని సెట్ వరకు వెళ్లాలి. ఇక కొన్ని సార్లు పోస్టర్ లలో మా పేర్లు ఉండవు. లవ్ స్టోరీ మూవీలలో నటించిన కూడా ఎలాంటి గుర్తింపు రాదు. సినిమా అంటే అందరి కృషి అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఒక్కటి అని కాదు.. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో ఒక వివక్ష ఉంటుంది. సినిమా హిట్ అయితే హీరోకి ఇచ్చిన గుర్తింపు హీరోయిన్ కి ఇవ్వరు' అంటూ బుట్టబొమ్మ చెప్పుకొచ్చింది.