ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి.

ఇక సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. ఈమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక యష్ ని పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ షోలో కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ బ్యూటీ ప్రేరణ తన భర్త శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ షోలో ఏ జోడీలు టాప్ లో ఉన్నాయో చూద్దాం.

 
ఈ షోలో మొదటి నుండి ఇప్పటివరకు టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు. టాప్ టూలో ప్రేరణ, శ్రీపాద్ లు ఉన్నారు. ఇక కవిత, ఆదిరెడ్డి టాప్ 3 లో కొనసాగుతున్నారు. టాప్ 4లో సోనియా, యష్ లు ఉన్నారు. ఇక చివరకు ఆ జోడీ ఇస్మార్ట్ జోడీ అవుతుంది చూడాలి మరి. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఇక ఈ షోని వీక్షించే ప్రేక్షకులు మాత్రం ఇస్మార్ట్ జోడీ షోలో ఇస్మార్ట్ జోడీ విన్నర్ కచ్చితంగా అమర్ దీప్, తేజునే అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ సారి విన్నర్ ప్రేరణ, శ్రీపాద్ యే తగ్గేదేలే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: