
సినీ నటి నిధి అగర్వాల్. ఈమె మార్వారీ కుటుంబంలో జన్మించింది. ఈమె తెలుగు సినిమాలతో పాటుగా హిందీ సినిమాలలో కూడా నటించింది. బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ కి తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. ఈ ముద్దుగుమ్మ 2018లో అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే నిధి తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను, హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ బ్యూటీ తన అందం, నటనతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా మే నెలలో 9న విడుదల కానుంది.
అలాగే ఈమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో కూడా నటించనుంది. ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో తెరకెక్కనున్నాయి. ఇక ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఒక్కటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన నెటిజన్స్ వావ్ ఎంత క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.