సినీ నటి నిధి అగర్వాల్ గురించి పరిచయం అనవసరం. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినేయంతో మంచి మంచి అవకాశాలు కొట్టేస్తుంది. ఈమె మార్వారీ కుటుంబంలో జన్మించింది. ఈమె తెలుగు సినిమాలతో పాటుగా హిందీ సినిమాలలో కూడా నటించింది. బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ కి తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది.
 
ఈ ముద్దుగుమ్మ 2018లో అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే నిధి తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను, హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ బ్యూటీ తన అందం, నటనతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా మే నెలలో 9న విడుదల కానుంది.

 
అలాగే ఈమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో కూడా నటించనుంది. ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో తెరకెక్కనున్నాయి. అయితే తాజాగా ఈ అందాల భామ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. మున్నా మైఖేల్ సినిమాకి ఒకే చెప్పాక.. టీమ్ కాంట్రాక్ట్ పైన సైన్ చేయించుకుందంట. ఆ కాంట్రాక్ట్ లో నో డేటింగ్ అని కండిషన్ ఉంది అంట. కానీ ఆ విషయం తనకి తర్వాత తెలిసింది అంట. సినిమాలో నటించే నటీనటులు లవ్ లో ఉంటే వర్క్ పైన ఫోకస్ చేయలేరని ఆ టీమ్ అలాంటి కండిషన్ పెట్టింది అని నిధి అగర్వాల్ అనుకుంది అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: