
తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీగా ఉన్నదని తన అభిప్రాయంగా తెలిపారు. తన 47 ఏళ్ల కెరియర్లో ఎంతో మంది తెలుగు నటీనటులతో తాను పనిచేయడం జరిగింది.తెలుగు ఆడియన్స్ గౌరవించే విధానం కూడా తనకి బాగా నచ్చుతుందని వెల్లడించారు. ఏఎన్ఆర్ వంటి హీరోలతో కలిసి నటించే అవకాశం తనకు రావడం అదృష్టమని తెలియజేశారు.. తాను గతంలో నటించిన మలయాళ సినిమాలు కూడా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి కానీ ఇప్పుడు డైరెక్ట్ గా L2 ఎంపురాన్ అనే సినిమాని విడుదల చేస్తున్నామంటూ తెలిపారు.
అయితే ఈ సినిమాని అందరూ కూడా లూసీఫర్ కి సీక్వెల్ అనుకుంటూ ఉంటారు.. కానీ ఇది సీక్వెల్ కాదని అసలు కథ మూడు భాగాలుగా అనుకున్నామని..L2 కోసం చిత్ర బృందం సుమారుగా ఏళ్లపాటు చాలా కష్టపడి పని చేశామని.. 50 డేస్ ఫంక్షన్ ని కూడా హైదరాబాదులో చాలా గ్రాండ్ గా చేసుకుంటామని నమ్మకం తమకుందని తెలిపారు. ఇక మలయాళ సినీ పరిశ్రమ ఆడియన్స్ గురించి ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పే మోహన్లాల్ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని పొగిడేయడంతో ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. L2 సినిమా సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.