నిధి అగర్వాల్ సౌత్ నార్త్ లో గుర్తింపు ఉన్న హీరోయిన్.. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ది రాజా సాబ్ మూవీ కూడా విడుదల కాబోతోంది.అయితే ఈ రెండు సినిమాలు హిట్ అయితే కనుక నిధి అగర్వాల్ రేంజ్ మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే.. నిధి అగర్వాల్ కి ఆ హీరోతో డేటింగ్ చేయకూడదు అంటూ ఓ కండిషన్ పెట్టారట. మరి ఇంతకీ నిధి అగర్వాల్ ఎవరితో డేటింగ్ చేయకూడదని కండిషన్ ఎదురైంది.. ఇంతకీ ఆ కండిషన్ ఎవరు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. కొంతమంది హీరో హీరోయిన్లు కలిసి వరుసగా సినిమాలు చేస్తే వారిద్దరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొడతాయి. 

అయితే అందులో కొన్ని రూమర్లుగా మిగిలిపోతే కొంతమంది మాత్రం నిజంగానే డేటింగ్ లు చేస్తారు. నిధి అగర్వాల్ కూడా ఓ హీరోతో డేటింగ్ చేయకూడదని కండిషన్ ఎదురైందట. అది కూడా బాలీవుడ్ హీరో ఎవరంటే టైగర్ ష్రాఫ్ తో.. ఇక విషయంలోకి వెళ్తే.. నిధి అగర్వాల్ మున్నా మైఖేల్ అనే మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది  బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హీరోగా చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే సినిమాకి ముందు కొన్ని అగ్రిమెంట్ల మీద హీరో హీరోయిన్లు సైన్ చేయాల్సి ఉంటుంది.అలా నిధి అగర్వాల్ కూడా సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఓ అగ్రిమెంట్ మీద సైన్ చేసిందట.

అయితే సైన్ చేసేటప్పుడు ఆ అగ్రిమెంట్ ఏంటో చదవలేదు. కానీ ఆ తర్వాతే ఆ అగ్రిమెంట్ చూడగా అసలు విషయం బయటపడిందట.ఇక ఆ అగ్రిమెంట్లో ఉన్న రూల్స్ లో ఒక కండిషన్ ఏంటంటే.. సినిమా పూర్తయ్యే వరకు కూడా హీరోతో నువ్ డేటింగ్ చేయకూడదు అని నిధి అగర్వాల్ కి కండిషన్ పెట్టారట నిర్మాతలు.  అయితే ఈ కండిషన్ కి కారణం సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడితే సినిమాపై దృష్టి పెట్టకుండా నటినటులు ప్రేమలో మునిగి తేలుతారు. ఫలితంగా సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో నిర్మాతలు అలాంటి కండిషన్ పెట్టారట. అయితే ఈ వింత కండిషన్ చూసి నిధి అగర్వాల్ కూడా ఆశ్చర్యపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: