ఏంటి రష్మిక మందన్నా కెమెరామెన్ తో ప్రేమలో పడిందా.. ఇంతకీ విజయ్ దేవరకొండను వదిలేసి రష్మిక మందన్నా ప్రేమలో పడింది ఎవరితో..ఆ కెమెరామెన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది సెలెబ్రెటీలు తమ మనసులో ఉన్న విషయాన్ని ఏదో ఒక టైం లో బయట పెడుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు తమకి ఇష్టం అయినా వారి గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతూ వారితో పరోక్షంగా డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ అనగానే అందరికీ రష్మిక విజయ్ లే గుర్తుకు వస్తారు.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు.అలాగే ప్రతి పండగను ఈ జంట కలిసే చేసుకుంటారు.కానీ వేరువేరుగా చేసుకున్నట్టు ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియా జనాలకు అడ్డంగా బుక్ అవుతారు.

అలాగే వెకేషన్ లకి కూడా వెళ్తారు.అలా వీరి ప్రేమ కొనసాగుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఆ కెమెరామెన్ మీద ప్రేమ పెంచుకున్న రష్మిక నా మనసుని గెలిచావు అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. మరి ఇంతకీ రష్మిక హార్ట్ గెలిచిన ఆ కెమెరామెన్ ఎవరు ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.రష్మిక మందన్నా సల్మాన్ ఖాన్ కాంబోలో మురగదాస్ డైరెక్షన్లో విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా మూవీ సికిందర్.. మార్చి 30న విడుదల కాబోతున్న సికిందర్ మూవీకి భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే సినిమా విషయం కాస్త పక్కన పెడితే రష్మిక తాజాగా ఎక్కడికో ట్రిప్ కు వెళ్తూ ఎయిర్పోర్టులో దర్శనం ఇచ్చింది. అయితే ఎయిర్ పోర్టుకి ఎవరైనా సెలబ్రిటీలు వస్తే అక్కడే ఉన్న జనాలు వారితో సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటారు.

అలా రష్మిక మందన్నా కనిపించడంతో ఎయిర్ పోర్ట్ లో ఉన్న చాలా మంది మీడియా వాళ్లు అక్కడికి వచ్చారట. అయితే వారిలో ఓ కెమెరామెన్ రష్మికని చూసి అదిరిపోయే డ్యాన్స్ చేశారట.ఇక ఆయన డాన్స్ కి ఫిదా అయినా రష్మిక లవ్ సింబల్ పెట్టి నా హార్ట్ ని గెలుచుకున్నారు మీరు..మీ లవ్ కి నేను పడిపోయాను అంటూ మాట్లాడింది. అయితే రష్మిక మందన్నా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక విజయ్ దేవరకొండని వదిలేసి కెమెరామెన్ పై ప్రేమ పెంచుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సెలబ్రిటీలు తాము ఫీదా అయిన వారిపై ఇలాంటి కామెంట్లు చేయడం కొత్తేమీ కాదు.ఇప్పటికే రష్మిక ఎంతోమందిపై తన అభిమానాన్ని చూపించింది అలాంటివారిలో ఈ కెమెరామెన్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: