
క్రాంతి అనే వ్యక్తి తన పొలానికి కంచె వేసుకుంటున్న సమయంలో మురళీకృష్ణ అనుచరులు అడ్డుకున్నారని ఈ క్రమంలోనే క్రాంతి పైన కొంతమంది దుండగులు దాడి చేసినట్లు క్రాంతి ఆరోపణలు చేశారు. అయితే ఈయన ఆరోపణలు ప్రకారం మురళి కృష్ణ అనుచరులే తన చేతులను కట్టేసి మరి దాడి చేశారని తెలియజేశారు. ఈ దాడిలో క్రాంతికి గాయాలయ్యాయని ప్రభుత్వాసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు. క్రాంతి తన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు చాలా దిగ్భ్రాంతిగా ఉన్నాయట.. మురళి కృష్ణ అనుచరులు తనని బెదిరిస్తూ ఉన్నారని అలాగే పొలాన్ని అమ్మితే తమకే అమ్మాలని లేకపోతే తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట మురళి.
ఈ బెదిరింపులు చేయడంతో పాటు తన ప్రాణాలకు ముప్పు ఉందని క్రాంతి కూడా ఆందోళనను తెలియజేస్తున్నారు ఈ ఘటన అనంతరం క్రాంతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి మురళి కృష్ణ ఆయన అనుచరుల పైన కూడా కేసు ఫైల్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి మరి దర్యాప్తుని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన మురళి కృష్ణ లేదా ఆయన టీమ్ ఇంతవరకు ఏ విధంగా కూడా స్పందించలేదు.. ఈ వివాదం మాత్రం సంగారెడ్డి జిల్లాలో చాలా హాట్ టాపిక్ గా మారుతున్నది.