
వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ప్రధానంగా ఈ సినిమా టైటిల్ విషయంలో పోలీసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సినిమానే ఆపేసినట్టు సంపత్ నంది తెలిపారు. గాంజాకు వ్యతిరేక కథాంశంతో తమ సినిమాను ప్లాన్ చేశామని అయితే పోలీసుల నుంచి టైటిల్ కు సంబంధించి వ్యతిరేకత రావడంతో సినిమానే అపేశామని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే సంపత్ నంది మాటలు అస్సలు నమ్మేలా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే గాంజా శంకర్ సినిమాను నెగిటివ్ సెంటిమెంట్ గా ఫీలై ఆపేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇదే సినిమా కథను మార్చి సంపత్ నంది సినిమాను తెరకెక్కిస్తారేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంపత్ నందికి ప్రేక్షకుల్లో క్రేజ్ అయితే బాగానే ఉంది.
సంపత్ నంది ఓదెల2 సినిమాకు అన్నీ తానై కీలకంగా వ్యవహరించారు. ఓదెల2 సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటానని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఓదెల2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. సంపత్ నంది స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఓదెల2 సినిమా తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కగా ఈ సినిమా ఓటీటీ హకులు సైతం ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.