టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో కొన్నాళ్లపాటు వారి హవాను కొనసాగిస్తారు. అలాంటివారిలో నటి సమంత ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఎన్నో సినిమాలలో నటించి తనదైన నటన, అందానికి గాను ఎన్నో అవార్డులను అందుకుంది.


టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన ఈ చిన్నది ఆడి పాడింది. ప్రస్తుతం సమంత టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. సమంత ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని ఫోటోలను, విషయాలను అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. కాగా ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.


సమంత తన ఫోన్ కాంటాక్ట్స్ లో ఓ ఫోన్ నెంబర్ ని మై లవ్ అని సేవ్ చేసుకుందట. అయితే ఆ నంబర్ ఎవరిది అయి ఉంటుందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్న కొనసాగుతున్నాయి. కొంతమంది తన మాజీ భర్త నాగచైతన్య నెంబర్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరేమో నాగచైతన్య నంబర్ కాదు సమంతకు మొదటిసారిగా సినిమాలలో అవకాశం ఇచ్చిన గౌతమ మీనన్ నెంబర్ అయి ఉంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ నంబర్ ఎవరిది అయ్యి ఉంటుంది అని సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయం పైన సమంత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: