తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటుడిగా ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు పరసగా బోల్తా కొడుతూ వచ్చాయి. నితిన్ కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆఖరుగా నితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది.

ఇలా వరుస అపజయాతో కెరీర్ను కొనసాగిస్తున్న నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. మార్చి 28 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అద్భుతమైన రీతిలో ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మార్చి 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు HICC , నోవేటెల్ , హాల్ 3 , హైదరాబాదులో నిర్వహించనున్నట్లు , ఇక ఈ ఈవెంట్ కు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: