ఎస్.జే.సూర్య నటుడిగా డైరెక్టర్ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన గేమ్ ఛేంజర్, సరిపోదా శనివారం వంటి సినిమాలతో తన విలనిజాన్ని కూడా బయటపెట్టారు.ముఖ్యంగా వెరైటీ విలనిజంతో సరిపోదా శనివారం సినిమాలో నాని కంటే మంచి నటన తో ఆకట్టుకున్నారని ఈ సినిమాకి ఎస్.జే. సూర్యకి మంచి పేరు వచ్చింది.అయితే అలాంటి ఎస్.జే.సూర్య కేవలం నటుడి గానే కాదు డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఖుషి మూవీ కి డైరెక్షన్ చేసింది ఎవరో కాదు ఎస్ జె సూర్యనే.. అయితే తాజాగా ఎస్ జే సూర్య ఖుషి మూవీ విషయంలో అలా జరిగితే నేను చనిపోయే వాడిని అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి ఇంతకీ ఆయన అలా ఎందుకు మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఎస్. జే. సూర్య నటించిన తాజా మూవీ వీర ధీర శూర..

 విక్రమ్ హీరోగా ఎస్.జే.సూర్య, దుషార విజయన్ కీలక పాత్రల్లో చేస్తున్న ఈ సినిమా మార్చి 27న విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ ఎస్. జే. సూర్య ఖుషి మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య మాట్లాడుతూ.. ఖుషి మూవీ కి దర్శకత్వం వహించిన సమయంలో ఖుషి మూవీ కాపీ చూసి ఎవరూ కూడా స్పందించలేదు. సినిమా బాగుందని గాని బాగాలేదని గాని ఎవరు చెప్పకపోవడంతో చాలా బాధపడ్డాను. అయితే మొదటి రోజు సినిమా విడుదలయ్యాక కూడా సినిమాపై అంత హైప్ లేదు.

 ఎవరూ ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. కానీ రెండో రోజు నుండి ఖుషి మూవీ కి బ్రహ్మరధం పట్టారు జనాలు. అయితే ఈ మూవీ మొదటి రోజు టాక్ ఎలా అయితే ఉందో అలాగే కొనసాగితే మాత్రం ఆ బాధతో నేను చనిపోయేవాడినేమో.. కానీ నా అదృష్టం కొద్దీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే భవిష్యత్తులో కచ్చితంగా మెగా ఫోన్ పట్టి మళ్ళీ డైరెక్షన్ చేస్తాను అంటూ ఎస్ జె సూర్య చెప్పుకొచ్చారు. ఇక తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ ఎందుకు చేయడం లేదు అని మీడియా నుండి ప్రశ్న ఎదురవ్వగా  తెలుగులో సరైన స్క్రిప్ట్ నా చేతికి రాలేదు. ఒకవేళ మంచి స్క్రిప్ట్ దొరికితే తెలుగులో కూడా డైరెక్ట్ ఫిల్మ్ చేస్తాను అంటూ ఎస్.జే.
 సూర్య చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: