టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు సరైన రిలీజ్ డేట్ దొరకడం ఎంతో కష్టమనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు రిలీజ్ డేట్లను ప్రకటించినా ఆ సమయానికి సినిమాలు రిలీజ్ కావడం జరగదు. అయితే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏకంగా 4 పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నాలుగు సినిమాలు విడుదలైతే మాత్రం అభిమానులకు పండగేనని చెప్పవచ్చు.
 
ఈ 4 సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. అయితే అ సినిమాల విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో ఆ సమయానికి సినిమా విడుదలవుతుందో లేదో చెప్పలేము. మార్చి నెల 19వ తేదీన యశ్ టాక్సిక్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. యశ్ కేజీఎఫ్2 తర్వాత నటించి రిలీజవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
 
మార్చి నెల 20వ తేదీన సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ తెరకెక్కుతోంది. మార్చి నెల 27వ తేదీన ది ప్యారడైజ్ సినిమా తెరకెక్కుతుండగా నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
 
సినిమా పెద్ది అనే టైటిల్ తో తెరకెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. వారం గ్యాప్ లో 4 పెద్ద సినిమాలు విడుదలైతే ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇండస్త్రీని షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హీరో రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: