టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఈ దర్శకుడు ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలను రూపొందించి మంచి విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా మంచి గుర్తింపు ఉంది.

ఆఖరుగా ఈ దర్శకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మార్చి 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు  అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వేళ ఈ సినిమా ట్రైలర్ కనుక అద్భుతంగా ఉండి మాస్ సినిమాలను ఇష్టపడే జనాలను ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ కి భారీ ఓపెనింగ్స్ రావడం కన్ఫామ్ అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: