టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త నటులు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంటున్నారు. కానీ మరి కొంత మంది నటించిన మొదటి మూవీ తో పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా మంచి గుర్తింపును మాత్రం సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ఒకరు.

ఈయన కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్ రాజు నిర్మించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఆయన సోదరుడి కుమారుడు హీరో గా రూపొందిన మొదటి సినిమా కావడంతో ఈయన చాలా జాగ్రత్తలు ఆ సినిమా విషయంలో తీసుకొని ఉంటాడు. ఆ మూవీ కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇకపోతే ఆశిష్ కొంత కాలం క్రితం లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఈయన నటించిన రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర విఫలం అయ్యాయి.

ఇలా ఈయన నటించిన రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ నటుడు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు అని తెలుస్తుంది. తాజాగా మరో క్రేజీ మూవీ ని ఈ నటుడు సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆశిష్ తన తదుపరి మూవీ ని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చేయనున్నట్లు , ఈ సినిమాలో ఆశిష్ రా అండ్ రాస్టిక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: