
నిజానికి శ్రీదేవి తన సినిమాల కోసం చాలా కష్టపడే మనస్త్తవం కలది. కమిట్ అయిన సినిమాల విషయంలో చాలా పక్కాగా ఉంటుంది . అయితే కొన్ని కొన్ని సార్లు ఆమె కమిట్ అయినా సినిమాల కోసం చాలా రిస్కీ షాట్స్ కూడా చేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా చిరంజీవితో కమిట్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా టైంలో ఆమె చేసిన రిస్కీ షాట్స్ అసలు ఎప్పటికీ మర్చిపోలేనిది . కొన్ని కొన్ని సన్నివేశాలలో ఆమె ఆరోగ్యం బాగో లేకపోయినా సరే సినిమా షూట్ కి వచ్చి మరి ఆ సీన్స్ లో కంప్లీట్ చేసింది .
ఇప్పుడు సేమ్ టు సేమ్ జాన్వి కపూర్ కూడా అలాగే చేస్తుందట . నిజానికి జాన్వికపూర్ హెల్త్ అస్సలు బాగోలేదట . కానీ ఆమె రామ్ చరణ్ తో కమిట్ అయిన సినిమా షెడ్యూల్ ఎక్కడ బ్యాక్ వెళ్ళిపోతుందో అని .. ఆమె వల్ల చిత్ర బృందం ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని జాన్వికపూర్ కి హెల్త్ బాగో లేకపోయినా అస్సలు బాడీ సహకరించకపోయిన సినిమా సెట్స్ లో పాల్గొంటుందట. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . తల్లి పోలికలు నీకు బాగా వచ్చాయి అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మొత్తానికి చాలా కాల తరువాత సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది..!!