మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో , వెబ్ సిరీస్లలో నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఈ బ్యూటీ తెలుగులో ఇష్క్ మూవీ ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నిత్య మీనన్ కి భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు పెద్దగా దక్కడం లేదు.

కాకపోతే ఈమె తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నట్లయితే చిన్న సినిమాల్లో కూడా నటించడానికి రెడీగా ఉండడంతో ఈమె పర్వాలేదు అనే స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే నిత్య మీనన్ కొంత కాలం క్రితం బ్రీత్ ఇన్ టు ది షాడోస్ అనే వెబ్ సీరీస్ లో హీరోయిన్గా నటించింది. ఇందులో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించాడు. ఇకపోతే ఈ వెబ్ సీరీస్ లో నిత్యా మీనన్ , శ్రుతి బాప్నా మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. ఇది ఆ మధ్య కాలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే తాజాగా నిత్య మీనన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా బ్రీత్ ఇన్ టు ది షాడోస్ వెబ్ సీరీస్ లోని లిప్ లాక్ సన్నివేశం గురించి నిత్య మీనన్ మాట్లాడింది.

తాజాగా నిత్యా మీనన్ మాట్లాడుతూ ... నేను కొంత కాలం క్రితం హిందీలో బ్రీత్ ఇన్ టు ది షాడోస్ అనే వెబ్ సిరీస్ లో నటించాను. అందులో ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. అది ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ సన్నివేశం ఆ కథలో భాగంగా వచ్చింది. అందుకే నేను నటించాను. ఇకపై నేను చేసే సినిమాల్లో , వెబ్ సీరిస్ లలో కూడా కథ డిమాండ్ చేస్తే ఏ సన్నివేశంలో అయినా నటిస్తాను. అందుకు ఏ మాత్రం భయపడను అని నిత్యా మీనన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: