
కాగా ఇప్పుడు చిరంజీవి ఎదుర్కొన్న సమస్య నాగార్జున కూడా ఎదుర్కొంటున్నాడు . టాలీవుడ్ ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలను ఓకే చేస్తున్న హీరోయిన్లు మాత్రమే ఎంపిక చేసే విషయంలో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఏ హీరోయిన్ ఆయన పక్కన సూట్ అవుతుంది అని చెప్పడం పెద్ద గగనంగా మారింది . యంగ్ హీరోయిన్స్ ఆయన పక్కన సూట్ అవ్వలేకపోతున్నారు . సీనియర్ హీరోయిన్స్ ఆయనతో సినిమా ఓకే చేయడం లేదు.
అయితే ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు నాగార్జున . ఆయన తన వందవ సినిమా కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేసుకున్న విషయం చాలా టఫ్ గా మారినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో మొదటగా అన్షు అదే విధంగా మీనా అని అనుకున్నారట . ఆ తర్వాత మీనా ని తీసేసి త్రిష ని కూడా అనుకున్నారట . కానీ ఇప్పుడు ఎవరు ఈ సినిమాకి సెట్ కావడం లేదు అని ఆయన లుక్స్ ఈ సినిమాలో వేరే విధంగా ఉండబోతున్నాయి అని .. ఈ సినిమాలో ఆయనకు యంగ్ హీరోయిన్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ మేకర్స్ ఆలోచిస్తున్నారట . కానీ నాగార్జున పక్కన యంగ్ హీరోయిన్స్ నటించడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దీంతో నాగార్జునకు హీరోయిన్ సమస్య పెద్ద తలనొప్పిగా మారిపోయింది..!!