
తమ కారావాన్లు షూటింగ్ కి దూరంగా ఉంచుతారు ..
కొన్నిసార్లు సినిమా పోస్టర్లో కూడా హీరోయిన్ల పేరు కూడా ఉండదని విమర్శ..
చిత్ర పరిశ్రమల్లో హీరోల డామినేషన్ అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే .. హీరోయిన్ ఎవరు ఉండాలి .. ఇలా అన్నీ కూడా హీరోలు చెప్పినట్టుగానే నిర్మాతలు , దర్శకులు చేస్తూ ఉంటారు .. ఇదే క్రమంలో హీరోయిన్ల పై వివక్ష ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలుసు .. అయితే ఇప్పుడు ఇదే ఇష్యూ పై ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు విమర్శలు చేస్తూ వస్తున్నారు ..
అయితే ఇప్పుడు తాజాగా స్టార్ బ్యూటీ పూజ హెగ్డే కూడా ఇది ఇష్యూ పై స్పందించింది .. హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ఆమె సంచల వ్యాఖ్యలు చేసింది . షూటింగ్స్ జరిగే ప్రదేశంలో హీరోల కారావాన్లు సెట్‌కు దగ్గరగా ఉంచుతారు .. ఇదే క్రమంలో హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని పూజ చెప్పింది .. తాము పొడవైన బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ వాటి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది .. అలాగే హీరోయిన్లు పలు రకాలుగా ఎన్నో వివక్షలకు గురవుతూ ఉంటారని కూడా ఆమె చెప్పింది ..
కొన్నిసార్లు పోస్టర్ లో హీరోయిన్ల పేరు కూడా పెట్టరని కూడా చెప్పింది .. ఇన్నేళ్లగా తాను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనను తాను సెకండ్ గ్రేట్ వ్యక్తి గానే భావిస్తానని కూడా పూజ హెగ్డే చెప్పింది .. ఇదే క్రమంలో పూజ హెగ్డే నటించే సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం పూజ బాలీవుడ్ , కోలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది . ప్రస్తుతం ఈమె చేతుల్లో ఆరడజను సినిమాలు ఉన్నాయి .. వీటిలో రజనీకాంత్ , విజయ్ , సూర్య , షాహిద్ కపూర్ వంటి అగ్ర హీరోల సినిమాలు కూడా ఉన్నాయి .