బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌ నటించిన పీకే సినిమా ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో ఒకటి .. 2014 లో వచ్చిన ఈ సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది .  అప్పట్లోనే ఈ సినిమా 800 కోట్లు పైనే కలెక్షన్లు రాబట్టింది .. అప్పటికే 3 ఇడియట్స్‌ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అమీర్ ఖాన్ ,  రాజ్ కుమార్ హిరాని కాంబోలో పీకేతో పాత రికార్డులన్నీ తిరగరాశారు .. అయితే భారతీయ ప్రేక్షకులు అంతగా ఆకట్టుకున్న ఈ సినిమా విషయంలో హీరో అమీర్ ఖాన్ అటు దర్శకుడు ఇరానీ ఇద్దరు అంతగా సంతృప్తిగా లేరు . అందుకు ప్రధాన కారణం ముందు అనుకున్న కథకు మధ్యలో మార్పులు చేయటమే అని అంటున్నారు.


పీకే పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే ఈ సినిమా వారికి ఆనందాన్ని ఇవ్వలేదని అమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .. వాస్తవానికి పీకే కథను  దర్శకుడు రాజకుమార్ హీరాని ముందు వేరేలా తయారు చేశారు .  కానీ షూటింగ్ చేసే సమయంలో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చింది .. అదే క్ర‌మంలో తాను అనుకున్న క్లైమాక్స్ అప్పుడే రిలీజ్ అయిన మరో సినిమాను పోలి ఉండడంతో దాన్ని కాపీ చేసినట్లు అవుతుందని హిరానీ భావించారు .. ఇక దాంతో క్లైమాక్స్ మొత్తం మార్చేశారు .. అయితే హిరానీ ముందు రాసిన క్లైమాక్స్ తీసి ఉంటే చిత్రం ఇంకా బాగుండేది అందుకే సినిమా పెద్ద విజయం సాధించినప్పటికీ మా ఇద్దరికి అంతగా ఆనందం ఇవ్వలేదని అమీర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు..


రీసెంట్ గానే రాజ్ కుమార్ హిరానీ కూడా ఓ ఇంటర్వ్యూలో పీకే గురించి ప‌లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా చేశారు .. మీరు తీసిన సినిమాల్లో అనుకున్న దానికంటే బాగా ఆడిన సినిమా ఏదంటే .. అందులో కూడా పీకే పేరే చెప్పాడు .. ఇదే క్రమంలో మంచి కంటెంట్ ఉంది అనుకునేంత స్థాయిలో హిట్ అవ‌ని సినిమా డంకీ అని చెప్పుకొచ్చాడు .  ప్రస్తుతం హిరానీ , సంజయ్ దత్ తో మున్నాభాయ్ 3 సినిమా చేసే పనిలో ఉన్నాడు .. అమీర్ సొంత దర్శకత్వంలో రూపొందిన ‘సితారే జమీన్ పర్’లో కూడా నటిస్తున్నాడు .. అలాగే త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమాతో కూడా ప్రేక్షకుల‌ ముందుకు రావాలని భావిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: