ప్రభాస్ ఇప్పుడైతే స్టార్ హీరో కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు పడ్డాడు. ముఖ్యంగా ఈయనతో మొదట సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు మొహం మీదే వీడికేం యాక్టింగ్ వస్తుంది.వీడేం హీరో అవుతాడు అంటూ తిట్టారట.అంతేకాదు ప్రభాస్ ని చూసుకుంటూ వీడితో సినిమా చేయడం బడ్జెట్ బొక్క అన్నట్లుగా మాట్లాడారట.అయినా కూడా ప్రభాస్ వాటన్నింటినీ ఓర్చుకొని ప్రస్తుతం ప్రపంచం గర్వించదగ్గ హీరోగా మారారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఈయన ఓ సంచలనం అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ప్రభాస్ ని ఓ సీనియర్ హీరో వీడు చిన్న హీరో వీడితో ఏమవుతుందిలే అన్నట్లుగా మాట్లాడి అవమానించారట.మరి ప్రభాస్ ని చిన్నచూపు చూసినా ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ తో ఏమవుతుందిలే అని చిన్నచూపు చూసిన హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ.

 అయితే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అలాంటిది వీరి మధ్య అలాంటి మనస్పర్ధలు ఎందుకు వస్తాయి అని మీరందరూ అనుకోవచ్చు. అయితే ఇది పర్సనల్ గా కాదు. ఓ సినిమా విషయంలో.. ఇక అసలు విషయం ఏమిటంటే.. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం మూవీ చిరంజీవి హీరోగా నటించిన అంజి మూవీ బాలకృష్ణ హీరోగా నటించిన లక్ష్మీ నరసింహ ఈ మూడు సినిమాలు ఒకే నెలలో రోజుల తేడాతో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. 2004 సంక్రాంతి బరిలో ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవిలు తమ సినిమాలతో పోటీపడ్డారు. అలా ప్రభాస్, బాలకృష్ణ నటించిన వర్షం, లక్ష్మీనరసింహ రెండు సినిమాలు జనవరి 14న ఒకేరోజు విడుదలయ్యాయి.ఇక చిరంజీవి నటించిన అంజి మూవీ జనవరి 15న విడుదలైంది.

ఇక ఈ మూడు సినిమాల్లో అంజి మూవీ డిజాస్టర్ అవ్వగా..బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ మూవీ హిట్ అయింది.కానీ ప్రభాస్ నటించిన వర్షం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీంతో ఇద్దరు సీనియర్ హీరోలను పడగొట్టి చిన్న హీరో అయిన ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అయితే లక్ష్మీ నరసింహ, వర్షం రెండు సినిమాలు ఒకేరోజు విడుదల చేద్దాం అనుకున్న సమయంలో  బాలకృష్ణ ప్రభాస్ చిన్న హీరో అంతగా మార్కెట్ కూడా లేదు.ఆ సినిమా వల్ల నాకేం ప్రాబ్లం అవుతుందిలే అని  ప్రభాస్ మూవీని తక్కువ అంచనా వేసి లక్ష్మీనరసింహ మూవీని అదే రోజు విడుదల చేశారట. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. లక్ష్మీనరసింహ హిట్ అయినప్పటికీ వర్షం మూవీ అంతకుమించి బ్లాక్ బస్టర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: