సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు కూడా పిల్లల విషయంలో కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అదేంటంటే.. కూతురు పుడితే కచ్చితంగా మళ్ళీ వారసుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది బహిరంగంగానే ఇలాంటి విషయాలను చెబుతూ ఉంటారు. ఇక రీసెంట్గా రణబీర్ కపూర్ సైతం మాకు కూతురు పుట్టింది వారసుడి కోసం ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పాడు.అలాగే చిరంజీవి కూడా తనకి వారసుడు కావాలి అంటూ పబ్లిక్ గా చెప్పారు. అయితే ఓ హీరో కూడా వారసుడి కోసం తన భార్యని టార్చర్ చేశాడట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే మంచు విష్ణు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మంచు విష్ణు వీరానికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని మొదట్లో తండ్రికి చెప్పడానికి విష్ణు భయపడ్డారట.

 అయితే ఈ విషయాన్ని లక్ష్మి, మనోజ్ లు చెప్పి తండ్రిని ఒప్పించారట. అంతేకాదు మొదట లవ్ మ్యారేజ్ వద్దు అని మోహన్ బాబు చెప్పడంతో బ్రహ్మానందం ఇంటికి వచ్చి మరీ మోహన్ బాబు కి క్లాస్ ఇచ్చారట. అయితే ఈ విషయాన్ని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే మంచు విష్ణుకి నలుగురు పిల్లలన్న సంగతి మనకు తెలిసిందే. మొదట ఇద్దరు కూతుర్లు పుట్టారు. ఆ తర్వాత ఓ కొడుకు పుట్టారు. ఆ తర్వాత మళ్లీ ఒక కూతుర్ని కన్నారు. అలా వీరికి మొత్తం నలుగురు సంతానం. అయితే ఇంత మంది పిల్లలు ఉన్నా కూడా మంచు విష్ణు మళ్ళీ నాకు పిల్లలు కావాలి అని విరానికా రెడ్డిని టార్చర్ చేశారట.

 కానీ వీరానికా మాత్రం అస్సలు ఒప్పుకోకుండా నీకు పిల్లలు కావాలంటే నన్ను వదిలేసి మరో అమ్మాయిని చూసుకొని పిల్లల్ని కనూ.. అంతేకానీ ఇంకా పిల్లలు కావాలంటే నా వల్ల కాదు అంటూ మొహం మీదే చెప్పేసిందట. అయితే విరానికా మాట్లాడిన విషయాన్ని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే విరానిక కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.అలా పిల్లల కోసం విష్ణు తనని ఇబ్బంది పెట్టారంటూ విరాణిక మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నప్పటికీ మళ్ళీ పిల్లలు కావాలి అన్నారంటే మంచు విష్ణు మళ్ళీ కొడుకు పుడతాడని కలలు కన్నారు కావచ్చు అందుకే వారసుడి కోసం ఇబ్బంది పెట్టారు కావచ్చు అంటూ నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: