తెలుగులో ప్రజెంట్ సీక్వెల్ సినిమాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి .. కానీ గతంలో ఆ తరహా సినిమాలు చాలా తక్కువ ఉన్న టైంలో వచ్చిన మూవీ ఆర్య 2 .. బ్లాక్ బస్టర్ మూవీ ఆర్యకు పనిచేసిన అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా ఇది .. ఆర్య 2 అనే టైటిల్ పెట్టడంతోనే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .. కానీ సినిమాకు మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది .. అయితే సుకుమార్ మిగతా ఫ్లాప్ సినిమా లాగే రిలీజ్ తర్వాత ఇది కల్ట్ స్టేటస్ ను దక్కించుకుంది .


అయితే చాలామంది ఆర్య 2ను ఫేవరెట్ మూవీగా చెప్పుకుంటారు . ఇలా చెప్పుకునే వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు . మ్యాడ్‌ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా ఆర్య 2 అంటే ఎంతో ఇష్టమట .. అయితే ఈ సినిమాకు టైటిల్ మైనస్ అని ఆయన అభిప్రాయపడ్డాడు .. తన కెరియర్లో తాను చూసిన సినిమాల్లో బెస్ట్ వరస్ట్ సీక్వెల్స్ గురించి కళ్యాణ్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. దృశ్యం 2 మూవి నాకు ఎంతో నచ్చిన బెస్ట్ సీక్వెల్‌ .  అలాగే దృశ్యం సినిమా నాకు ఎంతో నచ్చింది కానీ దాన్ని మించి దృశ్యం2  ఎంతో గొప్పగా అనిపించింది .. అలాగే నాకు అసలు నచ్చని సీక్వల్ అంటే నాగవల్లి నా చిన్నతనంలో చంద్రముఖి చూసి మైండ్ బ్లోయింగ్అయ్యాం .. అలాంటి సినిమాకు సిక్వెల్ ని చూస్తే నాగవల్లి మాత్రం అసలు ఎక్కలేదు మొత్తం మిస్ ఫైర్ అయింది .

 

అలాగే ఆర్యకు స్పిక్వల్ గా వచ్చిన ఆర్య 2 కూడా నాకు ఇష్టమైన మూవీ .. అయితే నిజానికి ఇది సీక్వెల్ మూవీ కాదు ఆర్య 2 అని పెట్టడంతో సీక్వెల్ అని అంతా భావించారు .. ఆ సినిమాకు , ఈ కథకు సంబంధం ఉండదు అలా కాకుండా మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి టైటిల్ పెడితే సినిమా ఇంకా బాగుండేది .. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఎంతో బాగుంటుంది .. ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య స్నేహాన్ని ఎంతో కొత్తగా చూపించారు .. ఒక సన్నివేశం చూసి హీరో చెడ్డవాడు అనుకుంటే కాని తర్వాత దీనిలో దానికి క్లారిటీ ఇస్తూ ఉంటుంది .. అలాగే నాకు సుకుమార్ గారి హిట్ సినిమాలు కంటే ఫ్లాప్ సినిమాలు అంటేనే చాలా ఇష్టం .  ఆర్య 2 , 1న్ నేనొక్కడినే , జగడం ఇవన్నీ చాలా బాగుంటాయంటూ కళ్యాణ్ శంకర్ తన మనసులో మాటను బయట పెట్టాడు..  ఇదే క్ర‌మ‌లో మ్యాడ్ 2 సినిమా ఈనెల 29న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. ఈ సినిమా ప్రమోషన్లను భాగంగా దర్శకుడు సీక్వెల్స్ పై తన అభిప్రాయాలను బయటపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: