సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి  క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ..మన అందరికీ తెలిసిందే .నందమూరి బాలయ్య తో సినిమా అంటే ఓరేంజ్ లో జనాలు ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి బాలయ్య తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక కాంబో హైలెట్గా ఉండబోతుంది.. అని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు బాలయ్యడైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం .. ఆయన మరెవరో కాదు టాలెంటెడ్ డైరెక్టర్ అయిన 'హరీష్ శంకర్ 'పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య సినిమా  ఉండబోతుంది .

ప్రెసెంట్ ఇదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హరీష్ శంకర్ ఎక్కువ యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తు వ‌చ్చారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో తో సినిమా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఆయన ఎక్కువగా మెగా హీరోలతోనే మూవీస్ చేశారు .. నందమూరి హీరోలు ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య సినిమా చేస్తే పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుందని నందమూరి ఫ్యాన్స్ అసలు ఊహించే ఉండరు. హరీష్ సినిమాలు కొంచెం డిఫరెంట్ గానూ బాలయ్య సినిమాలు వేరే స్టైల్ లోనూ ఉంటాయి. వీరిద్దరి కాంబో డిఫరెంట్ గా ఉండబోతుందని బాలయ్య ఫ్యాన్స్ తెగ గాబరా పడుతున్నారు. బాలయ్య కొన్ని సంవత్సరాలుగా యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ వస్తున్నారు .గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ,బాబీ లాంటి యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు.


బాలయ్యకు వీళ్లు మంచి ఇమేజ్ ను ఇచ్చారు .ఈ తరహాలోనే హరీష్ శంకర్ బాలయ్య తో సినిమాకు రెడీ అయినట్లు ప్రజెంట్ సోషల్ మీడియాలో వీళ్ళ కాంబో గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు .అయితే వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది.. ఏ రేంజ్ లో ఉంటుంది .అని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన సినిమాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉంటాయి. ఆయన ఒక కథ అనుకున్నాక దాన్ని మార్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టారు. అది కూడా ముందుకు కదల్లేదు. రవితేజతో ఈ మధ్యకాలంలో 'మిస్టర్ బచ్చన్స‌ సినిమా కూడా తీశారు .అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పుడే మొదలయ్యే ఆలోచన కనిపించడం లేదు. ఇంకో హీరోతో సినిమాల అన్నారు. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు .ఈలోపు వేరే భాషల్లో పెద్ద సినిమాలు తీసుకున్నా' కెవిఎన్ 'ప్రొడక్షన్స్ సంస్థ బాలయ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో పెద్ద బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి  అధిక‌ర ప్ర‌క‌ట‌న‌ రావచ్చు అంటున్నారు. 'అఖండ- 2' సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఉంటుంది అనే  వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: