
అసలు ఐశ్వర్య రాజేష్ అంటే తెలియని వాళ్ళు కూడా అబ్బబ్బ ఏం నటిస్తుంది .. జూనియర్ సౌందర్య అని.. సౌందర్య లేని లోటును తీర్చేస్తుంది అని భారీ భారీ డైలాగులు కొట్టే రేంజ్ కి ఎదిగిపోయింది . దానంతటికీ కారణం "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా అని చెప్పుకోక తప్పదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో కనిపించి నటించి మెప్పించింది ఐశ్వర్య రాజేష్ . అయితే ఇప్పుడు ఈ భాగ్యం పాత్ర ఎఫెక్ట్ కారణంగా మరొక బిగ్ బడా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.
అది కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే అని టాక్ వినిపిస్తుంది . త్వరలోనే అనిల్ రావిపూడి - చిరంజీవితో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే . అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఐశ్వర్య రాజేష్ ని మళ్ళీ చూస్ చేసుకున్నారట . చిరంజీవి - ఐశ్వర్య రాజేష్ మధ్య చాలా ఫన్నీ సీన్స్ కూడా రాసుకున్నారట అనిల్ రావిపూడి . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అమ్మడు నక్కతోక తొక్కినట్లుంది . బ్యాక్ టు బ్యాక్ బడా స్టార్స్ తో అవకాశాలు అందుకుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!