
అమల ఒక క్రేజీ సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అందులో హీరో ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు జనాలు . ఆయన ఎప్పుడూ కూడా ఫ్లాప్స్ అందుకునే హీరోనే కావడం గమనార్హం . ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్ . అక్కినేని అఖిల్ కి హిట్ ఇవ్వడానికి అమల కూడా హెల్ప్ చేస్తుంది . ఈ కారణంగానే అక్కినేని అమల తన కొడుకు నటించబోయే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుందట . గతంలో ఏజెంట్ సినిమా విషయంలో జరిగిన ట్రోలింగ్ అప్పుడు అమల ఏ రేంజ్ లో ఫైర్ అయిందో అందరికీ తెలిసిందే .
ఇప్పుడు ఏకంగా ఆమె రంగంలోకి దిగుతూ అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కీలకపాత్రలో కనిపించబోతుందట. అయితే అమ్మ పాత్రలో కాకుండా ఒక గెస్ట్ పాత్రలో కనిపించబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది అక్కినేని అమల పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. చూద్దాం అమల ఎలా కొడుకు కి హిట్ అందిస్తుందో..? అయితే గతంలో రామ్ చరణ్-తారక్-ప్రభాస్ సినిమాలల్లో అమ్మ క్యారెక్టర్ కోసం అడగ్గా ఆమె రిజెక్ట్ చేసిందట. మొత్తానికి ఇష్టం తో ఒప్పుకుందో ఇష్టం లేకుండా ఒప్పుకుందో తెలియదు కానీ ఫైనల్లీ ఆమె ఒప్పుకుంది అది చాలు అంటున్నారు అమల ఫ్యాన్స్..!