
ఎల్2 ఎంపురన్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమాకు మొదట ప్రాఫిట్ షేర్ ప్లాన్ అనుకున్నామని ఆ తర్వాత ప్లాన్ మారిపోయిందని తెలిపారు. గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ గురించ్ శంకర్ స్పందిస్తూ ఈ సినిమా ఫుటేజ్ ఏకంగా 5 గంటలు వచ్చిందని సినిమాలో తాను అనుకున్న కొన్ని మంచి సన్నివేశాలను సైతం పెట్టలేకపోయానని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ గేమ్ ఛేంజర్ సినిమాను ప్రాఫిట్ షేర్ ప్లాన్ ప్రకారం రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరో విధంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సైతం హూక్ స్టెప్స్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాతలను ఊహించని స్థాయిలో ముంచేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా నిర్మాతలకు ఈ సినిమా ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద మాత్రం గేమ్ ఛేంజర్ అనిపించుకోలేకపోయింది. ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించే విషయంలో గేమ్ ఛేంజర్ ఫెయిలైంది. దిల్ రాజు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో నిర్మాతగా భారీ సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.