ఒక వైపు ఐపీఎల్ సీజన్ నిన్నటి రోజు నుంచి మొదలు కావడంతో.. ఈ రోజున రాజస్థాన్ రాయల్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడబోతోంది. అది కూడా హైదరాబాదులో ఉప్పల్ స్టేడియంలో ఆడబోతుఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాదులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు కూడా డేవిడ్ వార్నర్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కు కొన్ని సీజన్ల పాటు ప్రాతినిధ్యం వ్యవహరించడం జరిగింది. 2016లో సన్రైజర్స్ ఐపీఎల్ విజేతగా కూడా కప్పు గెలుచుకుంది.

ఇక కరోనా లాక్ డౌన్  సమయంలో తెలుగు చిత్రాలలోని పాటలు, డైలాగులు, రీల్స్ చేస్తూ బాగానే అలరించారు డేవిడ్ వార్నర్.. అంతర్జాతీయ క్రికెట్ కి సైతం గుడ్ బై చెప్పిన వార్నర్ టి20 లీగల్స్ లో మాత్రమే ఎప్పుడు కనిపిస్తూ ఉన్నారు. 2025 లో వార్నర్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదట. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ అతను ఆడడం లేదని .. అయితే ఐపీఎల్ ద్వారా కాకుండానే సినిమా ద్వారా కూడా అలరించేందుకు సిద్ధమయ్యారు వార్నర్. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ లో నటించారు.


సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడంతో ఈ నేపథ్యంలోనే ఇటీవలే చిత్ర బృందం కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు చాలా గ్రాండ్గా ప్లాన్ చేసింది. ఈవెంట్ కి సైతం హాజరయ్యేందుకు వార్నర్ కూడా హైదరాబాదులోకి అడుగుపెట్టారు.. అయితే ఈవెంట్లో  పాల్గొనక ముందే ఐపీఎల్లో కనిపించబోతున్నారట.. హీరో నితిన్, శ్రీ లీల కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్ర బృందం మొత్తం కూడా స్టార్ స్పోర్ట్స్ లో తెలుగు ఛానల్ లో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: