గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ'గేమ్ ఛేంజర్' స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో “ గేమ్ ఛేంజర్ “ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..ప్రస్తుతం రాంచరణ్ తన ఫోకస్ అంతా తరువాత సినిమాపై పెట్టాడు.. రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'RC-16' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, దివ్వేంద్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు...

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'RC16' షూటింగ్ స్టార్ట్ కాగా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.. ఈ సినిమాలో రాంచరణ్ “ఆట కూలీగా” నటిస్తున్నాడు..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మరింత హైప్ జోడిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు..

 ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమా తరువాత రాంచరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీ చేయనున్నాడు.. రంగస్థలం రేంజ్ లో ఈ సినిమా ఉండనుంది..ప్రస్తుతం ఈ సినిమా స్టోరీని బిల్డ్ చేసే పనిలో సుకుమార్ వున్నారు..పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్.. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: