ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారి గురించి వారికి సంబంధించిన అన్ని విషయాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సోషల్ మీడియా యూజర్స్ తో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యువకులు డబ్బులు పోగొట్టుకొని మరి ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు వింటూనే ఉన్నాము. దీంతో ఇలాంటి వాటిపైన ప్రమోషన్ చేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

అలా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు కూడా ఇందులో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, హీరో ప్రభాస్, గోపీచంద్ వంటి వారి పైన కూడా కేసు ఫైలు నమోదు అయినట్లు తెలుస్తోంది. వీరందరి పైన రామారావు అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. స్టార్ హీరోలు కూడా బెట్టింగ్ యాప్స్ సైతం ప్రమోషన్ చేస్తూ ఉండడంతో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారని రామారావు ఆరోపించారు.


మరి ఇలాంటి ఫిర్యాదుల వల్ల పోలీసులు ఏ విధంగా స్పందించి మరి నిర్ణయాన్ని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. సినిమాల వల్ల భారీగానే సంపాదిస్తూ ఉన్న ఇలాంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్స్ చేయడంతో చాలామంది నష్టపోతున్నారంటూ రామారావు వెల్లడిస్తున్నారట.  మరి ఇకమీదటైనా ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్స్ చేయకుండా సిని సెలెబ్రెటీలతో పాటు యూట్యూబర్స్ సోషల్ మీడియా యూజర్స్ సరైన నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు కూడా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడమే కాకుండా నోటీసులు జారీ చేసి విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా మంది సెలబ్రెటీలు కొన్ని లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం అందుకున్నామంటూ తెలియజేశారు. మరి రాను రాను ఎంతమంది వీటి నుంచి బయటకు వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: