కొంతమంది హీరోయిన్లు సైలెంట్ గా అంటే రహస్యంగా పెళ్లి చేసుకోకుండానే వారికి నచ్చిన వారితో డేటింగ్ చేస్తూ పిల్లల్ని కూడా కంటూ ఉంటారు. అలా చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లికి ముందే తల్లయ్యి హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఆ మధ్యకాలంలో హీరోయిన్ ఇలియానా కూడా పెళ్లి కాకుండా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టింది. ఇప్పటివరకు పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయట పెట్టలేదు కానీ భర్తతో కలిసి ఉన్న ఫొటోస్ మాత్రం షేర్ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఇలియానా లాగే ఓ హీరోయిన్ కూడా తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. 

దానికి కారణం ఆ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలే. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు ఆమె ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నటి అంజలి అంటే తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే అలాంటి అంజలి తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్ లో కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.అయితే అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలలో అంజలి అచ్చం ప్రెగ్నెంట్ లాగే ఉండడంతో బేబీ బంప్ ఫొటోస్ లా ఉన్నాయి అంటూ అంజలికి కామెంట్లు పెడుతున్నారు.


అంతేకాదు అంజలి వేసుకున్న డ్రెస్సు కాస్త టైట్ గా ఉండడంతో పాటు పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో ఈ ఫొటోస్ చూసిన ఎవరైనా సరే అంజలి ప్రెగ్నెంట్ అనే అనుకుంటారు. అలా తాజాగా అంజలి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ మూవీలో అప్పన్న పాత్రకి భార్య పాత్రలో నటించిన అంజలి మెయిన్ హీరోయిన్ కియారా అద్వానీ కంటే ఎక్కువ గుర్తింపు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: