
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా ‘ కోర్ట్ ’ . స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అన్నది ఈ సినిమా ఉప శీర్షిక. ఈ సినిమా లో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా .. సినియా అయితే సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతోంది. ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన చిన్న సినిమా లలో ఈ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన సినిమా గా కోర్ట్ రికార్డులకు ఎక్కింది.
ఇక కోర్ట్ సినిమా థియేటర్లలో విడుదలై 9 రోజులు అవుతున్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ . 46.80 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా 9వ రోజు గ్రాస్ రూ. 4.50 కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక నిన్న శనివారం కావడంతో కోర్ట్ సినిమాకు కలెక్షన్లు పెరిగాయి. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు కూడా శనివారం రేంజ్‌లో నే వసూళ్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సోమవారం నుంచి వర్కింగ్ డేస్ కావడంతో కోర్ట్ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ను సాధిస్తోందో చూడాలి. మొత్తానికి కోర్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సాధించిందనే చెప్పాలి. కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అలాగే యూఎస్ లో కూడా 9 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. నిర్మాతగా నానికి ఇది మంచి ప్రాపిట్ సినిమా అని చెప్పాలి.